Gossipsబాలయ్య పై బోయపాటి అదిరిపోయే ప్లాన్.. పాపం బాలయ్య..

బాలయ్య పై బోయపాటి అదిరిపోయే ప్లాన్.. పాపం బాలయ్య..

ఓ పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బాలకృష్ణ. మరోపక్క తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియో వేడుకలోనే తన తర్వాత సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందని ఎనౌన్స్ చేశాడు బాలకృష్ణ. ఇక ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుందట. ఈ సినిమా గురించి ఓ అఫిషియల్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చెక్కలు కొడుతుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అంటే బోయపాటి శ్రీను, బాలకృష్ణ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పాత్రల్లో నందమూరి నట సింహం కనిపిస్తాడని తెలుస్తుంది. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉనాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో తన నట విశ్వరూపం చూపించిన బాలకృష్ణ. బోయపాటి సినిమాలో మరోసారి తన నటనా ప్రతిభ చూపిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమా కథ ఏంటి అన్ని ఇంకా బయటకు రాలేదు. సినిమాలో బాలయ్య మూడు పాత్రలు చేస్తున్నాడని మాత్రం లీక్ అయ్యింది.

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కూడా రెండు పార్టులుగా వస్తుంది. కథానాయకుడు జనవరి 9న రిలీజ్ అవుతుండగా మహానాయకుడు మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. బయోపిక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైంలో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ఏకంగా 60 డిఫరెంట్ గెటప్పులలో కనిపిస్తున్నాడని అంటున్నారు. ఎన్.బి.కే ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news