Gossipsబాలయ్య ఒక కమెడీయేనంటూ ఘోరంగా అవమానించిన నాగ బాబు..

బాలయ్య ఒక కమెడీయేనంటూ ఘోరంగా అవమానించిన నాగ బాబు..

మెగా, నందమూరి ఫైట్ ఇన్నాళ్లు సినిమాల వరకే ఉండేది కాని ఇప్పుడు పొలిటికల్ గా వెళ్లేసరికి ఆ ఫైట్ మరింత ముదిరింది. ఇప్పుడు మెగా బ్రదర్ నాగ బాబు రీసెంట్ గా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదనడం ఆశ్చర్యపరచింది. ఆ ఇంటర్వ్యూలో నాగబాబు ఆన్సర్ కు నందమూరి ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అయితే ఇది చాలదు అన్నట్టు తన మీద వస్తున్న ఈ విమర్శలకు మరింత రెచ్చగొట్టేలా మరో వీడియో ద్వారా బాలకృష్ణ ఎవరో తెలియదని తప్పు చేశాను క్షమించడి.. ఆయన ఓ పెద్ద కమెడియన్ అని అన్నాడు నాగ బాబు.

ఆయన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడని.. వళ్లూరి బాలకృష్ణ ఫోటో చూపించాడు నాగ బాబు. నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియని నాగ బాబుకి వళ్లూరి బాలకృష్ణ గుర్తు ఉన్నాడన్నమాట. అసలే అగ్గిమీద గుగ్గీలవుతున్న నందమూరి ఫ్యాన్స్ కు నాగ బాబు లేటెస్ట్ వీడియో మరింత కోపోద్రక్తులను చేస్తుంది. ఏదో ఓ మాట చెప్పి తప్పించుకోకుండా బాలకృష్ణ ఎవరో తెలియదని ఒకసారి.. ఆయనో పెద్ద కమెడియన్ అని మరోసారి నందమూరి ఫ్యాన్స్ కు తీవ్ర కోపాన్ని తెస్తున్నాడు నాగ బాబు.

ఓ పక్క మెగా నందమూరి మల్టీస్టారర్ చేయబోతున్న ఈ తరుణంలో ఇలా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్. అయితే ఇది పక్కా నాగ బాబు పొలిటికల్ స్టెప్ అని అంటున్నారు. ఆయన ఎవరో తెలియదని మర్యాదగా చెప్పాడు అతని మీద ఎవరైనా రివర్స్ అయితే అప్పుడు అసలు తాను ఏం మాట్లాడదలచుకున్నాడో చెబుతాడు కావొచ్చని అంటునారు. మరి నాగ బాబు వ్యక్తిగత అభిప్రాయాలకు మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వైరం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news