Gossipsఫ్లాపులొస్తున్నా డైరక్టర్ ను మాత్రం వదలని హీరోయిన్ ..!

ఫ్లాపులొస్తున్నా డైరక్టర్ ను మాత్రం వదలని హీరోయిన్ ..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ హిట్లు సైతం కొట్టిన ఈ డైరక్టర్ ప్రస్తుతం కెరియర్ లో చాలా వెనుపడి ఉన్నాడు. బయట నిర్మాతలెవరు అతనితో సాహసం చేయడం లేదని తెలిసి సొంత నిర్మాణంలోనే సినిమాలు చేస్తున్నాడు పూరి. తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన మెహబూబా మీద చాలా హోప్స్ పెట్టుకోగా అది కూడా నిరాశపరచింది. ఇక ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రాం తో పూరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రాం కొత్త లుక్ ట్రై చేశాడు. ఇదిలాఉంటే పూరితో పాటుగా ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి కూడా భాగమవుతుంది.

జ్యోతి లక్ష్మి సినిమాతో నిర్మాతగా మారిన చార్మి పూరి చేస్తున్న ప్రతి సినిమాకు సహ నిర్మాతగా ఉంటూ వస్తుంది. ఓ పక్క ఫ్లాపులు వస్తున్నా సరే పూరిని అంటిపెట్టుకుని ఉంది ఛార్మి.. ఫ్లాపులొస్తున్నా సరే పూరితో ఛార్మి కలిసి సినిమాలు చేయడం పట్ల వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మీద ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కొన్నాళ్లు కృష్ణవంశీ తో రిలేషన్ అంటూ ఛార్మీ మీద వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పూరితో ఛార్మి అది కూడా అసలేమాత్రం ఫాం లో లేకున్నా వెంట ఉండటంపై వార్తలు వస్తున్నాయి.

మరి వారి మధ్య రిలేషన్ ఏంటి అసలు పూరితో ఛార్మి ఎలా కనెక్ట్ అయ్యింది. వారి మధ్య ఉంది బిజినెస్ డీలింగ్స్ మాత్రమేనా లేక ఇంకా ఏదైనా ఉందా అన్న విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. పూరి రాం చార్మిలతో ఈమధ్య బయటకు వచ్చిన ఓ పిక్ సినిమా ఎనౌన్స్ మెంట్ గా కన్నా పూరి చార్మిల రిలేషన్ మీద ఎక్కువ దృష్టి పడేలా చేసింది. మరి ఈ విషయాలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news