Gossipsప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారు యాక్సిడెంట్..చిన్నారి పరిస్థితి విషమం ..!

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారు యాక్సిడెంట్..చిన్నారి పరిస్థితి విషమం ..!

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సికిందరాబాద్ దగ్గర ప్రయాణిస్తుండగా రాంగ్ రూట్ లో వస్తున్న ఓ బైక్ ను తన కారు ఢీ కొట్టడం జరిగింది. బైక్ మీద ప్రయాణిస్తున్న దంపతులతో పాటు ఓ చిన్నారి కూడా ఉందని తెలుస్తుంది. అయితే కారు గుద్దడంతో బైక్ మీద నుండి రోడ్డు మీద పడ్డారట. చిన్నారికి గాయాలయ్యాయని తెలుస్తుంది.

బైక్ మీద వస్తున్న ప్రయాణీకులే రాంగ్ రూట్ లో రావడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. కారుకి చిన్న డ్యామేజ్ జరుగగా కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. యాక్సిడెంట్ లో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయట. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు పాపని తరలించారని సమాచారం. అయితే వారికి ఎలా ఉంది అన్నది ఇంకా సమాచారం అందలేదు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news