Gossipsపెళ్లి కాకుండానే తల్లి.. అప్పుడే కొడుకు టెన్త్ క్లాస్!

పెళ్లి కాకుండానే తల్లి.. అప్పుడే కొడుకు టెన్త్ క్లాస్!

తల్లి కాకుండానే తల్లి అయ్యింది ఒక స్టార్ హీరోయిన్. అంతేగాక తన పిల్లలలో ఒకరిని టెన్త్ క్లాస్ టాపర్‌గా చేయడమే తన లక్ష్యం అంటోంది ఈ బ్యూటీ. అతి చిన్న వయసులో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 34 మంది పిల్లలకు తల్లైనా ఆ హీరోయిన్ గురించి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలు చర్చించుకోవడం విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మేటర్‌లోకి వెళ్లాల్సిందే.

దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ హన్సిక, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. కొంత కాలానికి తెలుగులో ఫేడ్ అవుట్ అయిన ఈ బొద్దు బ్యూటీ తమిళంలో మాత్రం తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూనే ఉంది. కాగా ఈమె ముంబైకు చెందిన 34 మంది పిల్లలకు తల్లిగా మారి వారికి సంబంధించిన అన్ని విషయాలను తనే స్వయంగా చూసుకుంటోంది. ఆ పిల్లలలో ఒకరు ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. తన కొడుకును ఎలాగైనా టాపర్‌గా చేయడమే లక్ష్యం అని అతడికి దగ్గరుండి మరీ చదువు నేర్పిస్తోంది హన్సిక.

హన్సిక మంచి మనసుకు జనాలు హ్యాట్సాఫ్ అంటున్నారు. కాగా ప్రస్తుతం ‘మహా’ అనే వివాదాస్పద చిత్రంలో హన్సిక నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పోస్టర్స్ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తూ వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news