Gossipsపాపం తమన్నా.. పెళ్లి ఆపేసిన వెంకీ..!

పాపం తమన్నా.. పెళ్లి ఆపేసిన వెంకీ..!

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా చలామణి అయ్యింది… అందం , అభినయమే కాదు అదరగొట్టే డాన్స్ ఇవన్నీ ఈ మిల్క్ బ్యూటీకి మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరిపక్కనా … అలాగే కుర్ర హీరోల్లో క్రేజ్ ఉన్న హీరోలందరితోనూ ఈ అమ్మడు నటించింది.

అయితే ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో తన కెరీర్ లో ఇక నటనకి గుడ్ బై చేప్తుందేమో అని కొంత మంది సినీ వర్గాలు గుస గుసలు ఆడుకుంటున్న సమయంలో అనుకోని విజయం ఆమె ఖాతాలో పడి ఆమె కెరియర్ ను మళ్ళీ ట్రాక్ లో పడేసింది. …

f2 కి ముందు సరైన సినీ అవకాశాలు లేకపోవడంతో… ఈ మిల్కీ బ్యూటీ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని మీడియాకి కూడా లీకులిచ్చేసింది..కానీ ఎఫ్ -2 సక్సెస్ ఎఫెక్ట్ తమన్నా తన నిర్ణయాన్ని మార్చేసుకుంది..ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో…సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ లు ఆమెకు క్యూ కడుతున్నాయట.

దీంతో పెళ్లి ఆలోచన వదిలేసుకొని మరికొంత కాలం సినిమాల్లోనే నటించాలని చూస్తోంది.ఈ మేరకు తాను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను అని ఆమె ప్రకటించేసింది. తమన్నా పెళ్లి మరికొంతకాలం వాయిదా పడడానికి f2 సినిమా పరోక్షంగా కారణం అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news