Gossipsనందమూరి వారసుడిపై బాలయ్య స్పందన..!

నందమూరి వారసుడిపై బాలయ్య స్పందన..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరోసారి తండ్రి అయ్యాడని తెలిసిందే. ఇంట్లో మరో వారసుడు వచ్చేశాడు. కుటుంబం మరింత పెద్దదవుతుందని ఎన్.టి.ఆర్ ట్వీట్ చేసి మరి ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. నందమూరి ఫ్యాన్స్ ఆనందోత్సవాలు ఏర్పరచిన ఎన్.టి.ఆర్ కొత్త వారసుడి ఎంట్రీపై బాలయ్య ఎలా స్పందించి ఉంటాడని ఆరా తీస్తున్నారు.

కొన్నాళ్లుగా బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం అందరికి తెలిసిందే. అప్పుడప్పుడు తారక్ అయినా మాటల ప్రస్థావనలో బాబాయ్ అంటాడు కాని జూనియర్ పేరు మాటవరుసకి ప్రస్థావించడు బాలకృష్ణ. అయితే సమీకరణాలు మారుతున్నాయి. ఇండస్ట్రీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. మన వాళ్లని మనం కలిపేసుకుపోవాలంటే పెద్ద మనసు చేసుకోవాలి. అందుకే ఎన్.టి.ఆర్ రెండో కొడుకు బారసాలకు పిలుపొస్తే బాలకృష్ణ వెళ్లాలని నిర్ణయించుకున్నాడట.

ఎదుటివాళ్ల మంచి కోరే వ్యక్తిగా బాలయ్య మనసు అందరికి తెలిసిందే. పైకి కనిపించేందుకు కాస్త సీరియస్ గా ఉన్నా లోపల ఆయనది సున్నితమైన మనసు. అందుకే ఈసారి ఎన్.టి.ఆర్ ఇంట్లో వేడుకకి తాను ముఖ్య అతిథి కావాలని అనుకుంటున్నాడట. ఇది కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు సంబరాలను తెచ్చే విషయమే. ఇదే జరిగితే మాత్రం ఇక మళ్లీ నందమూరి ఫ్యామిలీ ఒక్కటవుతుంది. ఆ తర్వాత లెక్క వేరేలా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news