Gossipsత్రివిక్రమ్, బన్ని హ్యాట్రిక్ మూవీ.. వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

త్రివిక్రమ్, బన్ని హ్యాట్రిక్ మూవీ.. వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తరువాత ఇండస్ట్రీ లో సన్నిహితంగా ఉండే మరో అగ్ర హీరో అల్లు అర్జున్. పవన్, మహేష్ తర్వాత త్రివిక్రమ్ రెండు సినిమాలు తీసిన ఏకైక హీరో బన్నీ నే. అయితే ఈ మధ్య ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది, అదే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో లో మరో సినిమా రాబోతుందని. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఆనందం తో ఊగిపోయారు. అయితే ఇక్కడే వీరిద్దరిని ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది.
గతంలో త్రివిక్రమ్ పవర్ స్టార్ తో తీసిన మొదటి రెండు సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది హిట్ అవ్వగా..మూడో సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. అదే విధంగా త్రివిక్రమ్ బన్నీ తో తీసిన మొదటి రెండు సినిమాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ కాగా, ఇప్పుడు మూడో సినిమాకి కూడా అజ్ఞాతవాసి సెంటిమెంట్ ఏమైనా రిపీట్ అవుతుందా అనే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ లో గుసగుసలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news