Gossipsడైరక్టర్ తో రొమాన్స్ నిజమే.. కాని..! అంటున్న అనసూయ..!

డైరక్టర్ తో రొమాన్స్ నిజమే.. కాని..! అంటున్న అనసూయ..!

యాంకర్ గా బుల్లితెర మీద తన అందాలతో అదరగొడుతున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది. క్షణం సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఎఫ్-2 వరకు అనసూయ సినిమాల్లో అదడపాదడపా అయినా ఆకట్టుకుంటుంది. ఇక అమ్మడు ఇప్పుడు ఏకంగా లీడ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. యువ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న సినిమాలో అనసూయ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందట. ఈ సినిమాలో హీరోగా పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడట.

తరుణ్ తో అనసూయ రొమాన్స్ పై రకరకాల వార్తలు వస్తుండగా వాటిపై స్పందించిన అనసూయ. తరుణ్ భాస్కర్ సినిమాలో తను నటించే విషయాన్ని కన్ ఫాం చేసిన అనసూయ ఆ పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. వార్తల్లో వస్తున్నట్టుగా రొమాంటిక్ రోల్ కాదని అంటుంది అనసూయ. సినిమాలో ఫీమేల్ లీడ్ గా తాను నటించడం లేదని కాని తన పాత్ర చాలా ప్రాముఖ్యతతో ఉంటుందని అంటుంది అనసూయ. విజయ్ దేవరకొండని కాకా పట్టి మరి ఆ రోల్ తనకి వచ్చేలా చేసుకుంది అనసూయ.

నూతన దర్శకుడు డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలు త్వరలో వెళ్లడవుతాయి. మరి అనసూయ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. జబర్దస్త్ కు అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ షూటింగ్స్ చేస్తున్న అనసూయ మొత్తానికి అటు సిల్వర్ స్క్రీన్.. ఇటు స్మాల్ స్క్రీన్ రెండిటిలో బిజీ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news