Gossipsటాలీవుడ్ నుండి దూరం అవుతున్న రవి తేజ..

టాలీవుడ్ నుండి దూరం అవుతున్న రవి తేజ..

”నేల టికెట్ ” సినిమా ఎన్నో అంచనాలతో … వెండితెర మీద కు వచ్చింది. కానీ అనుకున్న అంచనాలు తలకిందులు చేస్తూ… బాక్సపీస్ వద్ద బోర్లాపడింది. అంతే కాదు ఆ చిత్రం మీద నమ్మకం పెట్టున్న హీరో రవితేజతో సహా అందరి ఇమేజ్ ను నేలమీద కూర్చోబెట్టింది. అయితే ఈ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చినా … SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రవితేజతో మరో సినిమా చేసేందుకు రామ్ తాళ్లూరి సిద్ధం అవుతున్నాడు.
1
“అమర్ అక్బర్ ఆంథోనీ” తో రవి తేజకు భారీ విజయాన్ని అందించడంతో… రామ్ తాళ్లూరి ఇటీవల అతనితో ఒక కొత్త చిత్రం ప్రకటించారు. వి. ఆనంద్ దర్శకత్వంలో రవి తేజతో ఈ కొత్త చిత్రం అధికారికంగా ఒక వారం క్రితం ప్రకటించారు. అయితే, “అమర్ అక్బర్ ఆంథోనీ” బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఆ తరువాత సినిమా కొనేందుకు పంపిణీదారులు వెనుకంజ వేస్తున్నారట. ఈ ప్రభావంతో… ఈ చిత్ర నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ సమకూర్చుకోవడంలో రామ్ తాళ్లూరి ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం.
2
అందుకే ఈ చిత్రాన్ని వీలైనంత లో బడ్జెట్ లో తెరకెక్కించాలని నిర్మాత, దర్శకులకు అయన సూచించాడట. కాకపోతే ఈ చిత్ర కధాంశం బట్టి గ్రాఫిక్స్, భారీ భారీ సెట్లు అవసరం కానీ రామ్ కండిషన్లతో ఆ విషయాల్లో రాజీపడాలని దర్శకుడు భావిస్తున్నారట. ఇక ఈ ఏడాది రవితేజ నటించిన మూడు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రెమ్యూనేషన్ తగ్గించుకునేందుకు రవితేజ ఇష్టపడడంలేదట.ఇదే విధంగా ప్లాప్ సినిమాలు చేస్తుంటే ఒకోసారి టాలీవుడ్ కి దూరం అవుతాడేమో అని ఫ్యాన్స్ మనసులో అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news