Gossipsజూనియర్ ఐశ్వర్య అన్నారు.. కాని ఆమె కెరియర్ ఇలా..!

జూనియర్ ఐశ్వర్య అన్నారు.. కాని ఆమె కెరియర్ ఇలా..!

ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ అంటే తెలియని సిని ప్రియులు ఉండరు. అయితే ఆమె పోకికలతో వచ్చిన ఇద్దరు ముగ్గురు ఆమెలాంటి క్రేజ్ సంపాదించడంలో మాత్రం వెనుక పడ్డారు. ముఖ్యంగా జూనియర్ ఐశ్వర్యా రాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు సందడి చేసి ఆ తర్వాత తెలుగులో కూడా సినిమాలు చేసింది. మంచు మనోజ్, బాలకృష్ణ వంటి హీరోలతో చేసినా అమ్మడి కెరియర్ కు అంత బూస్టప్ దొరకలేదు. ప్రస్తుతం సోషల్ ఫ్లాట్ ఫాంలో ఎప్పుడు అలర్ట్ గా ఉంటున్న స్నేహా ఉల్లాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందని తెలుస్తుంది.
2
తన స్నేహితుడు అవీ మిట్టల్ తో పెళ్లికి సిద్ధమైంది స్నేహా ఉల్లాల్. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. ఎక్కడ కనిపించినా ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. ఆల్రెడీ బాలీవుడ్ మీడియా వారి ప్రేమ గురించి వార్తలు రాయగా వీరి ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అవి మిట్టల్ మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ అసోషియేషన్ చైర్మన్ గా ఉన్నాడు. స్నేహాతో అతని ప్రేమ అంతా ఓ మ్యాజిక్ అనేస్తున్నారు.
1
సో త్వరలో మరో హీరోయిన్ పెళ్లి జరుగబోతుంది. వీరి పెళ్లి డేట్ ఇంకా నిర్ణయించలేదు. ఈమధ్యనే బాలీవుడ్ ప్రేమ జంటలు దీపిక రణ్ వీర్, ప్రియాంకా నిక్ జోనాస్ లు ఒకటయ్యారు. సో వారి దారిలో ఇష్టమైన ప్రియుడిని పెళ్లాడబోతుంది స్నేహా ఉల్లాల్. పెళ్లి తర్వాత అయినా అమ్మడు సినిమాలతో బిజీగా మారుతుందేమో చూడాలి. జూనియర్ ఐశ్వర్యగా పేరు తెచ్చుకున్న స్నేహా కెరియర్ అలా ముగియనుంది. మరి పెళ్లి తర్వాత సినిమాలు అంటే సపోర్టింగ్ రోల్స్ చేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news