Gossipsచిరుకి చుక్కలు చూపిస్తూ రికార్డ్స్ ని తుడిచిపెట్టిన ఎన్టీఆర్..!

చిరుకి చుక్కలు చూపిస్తూ రికార్డ్స్ ని తుడిచిపెట్టిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన ‘అరవింద సమేత’ సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఇప్పటివరకు రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్ల మార్క్ ని దాటేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నమోదయ్యింది.

ఇది ఇలా ఉండగానే ఇప్పుడు మరో రికార్డు తిరగరాసే దిశగా ఈ సినిమా అడుగులు వేస్తోంది. అంటే … ఏకంగా మెగా స్టార్ చిరంజీవి రికార్డు ను బ్రేక్ చేసే రేంజ్లో ఎన్టీఆర్ సినిమా దూసుకువెళ్తోంది. చిరు నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రూ.164 కోట్ల గ్రాస్‌ను సాధించి 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ‘అరవింద సమేత’ 5వ స్థానానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 158 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దాదాపు మరో వారంలో ఈ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ని బ్రేక్ చేసేందుకు ఈ వీర రాఘవ సిద్ధం అవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news