Gossipsచిరంజీవి అల్లుడిని అవమానపరచిన మెహ్రీన్..

చిరంజీవి అల్లుడిని అవమానపరచిన మెహ్రీన్..

టాలీవుడ్ క్రేజీ బ్యూటీల్లో ఒకరైన మెహ్రీన్ కౌర్ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ను ఘోరంగ అవమాన పరచినట్టు తెలుస్తుంది. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో రెండో ప్రయత్నంగా మరో సినిమా మొదలు పెడుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీ కౌర్ ను అనుకున్నారు. అయితే ముందు సుధీర్ బాబుకి అనుకున్న ఈ సబ్జెక్ట్ అతని హీరోగా అయితే మెహ్రీన్ కౌర్ 30 లక్షలకు నటించేందుకు సై అన్నదట. సడెన్ గా సుధీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో కళ్యాణ్ దేవ్ ఎంటర్ అయ్యాడు.
2
కళ్యాణ్ దేవ్ హీరో అని తెలిసిన వెంటనే మెహ్రీన్ కూడా సినిమా నుండి తప్పుకుందట. తనకు ఇచ్చిన డబ్బుని కూడా తిరిగి ఇచ్చేసిందని తెలుస్తుంది. మెహ్రీన్ చేసిన పనికి కళ్యాణ్ దేవ్ షాక్ అయ్యాడట. ఇప్పుడిప్పుడే మీడియం రేంజ్ హీరోలతో నటిస్తున్న మెహ్రీన్ కళ్యాణ్ దేవ్ తో నటించడం వల్ల తన ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుందని భావించినట్టుంది. అందుకే సినిమా చేయలేనని దర్శక నిర్మాతలకు చెప్పేసింది.
1
మెహ్రీన్ తో పాటుగా ఒరు ఆదార్ లవ్ టీజర్ లో కన్నుగీటిన పిల్ల ప్రియా ప్రకాశ్ వరియర్ కూడా కళ్యాణ్ దేవ్ సినిమా చేయన్నదట. తెలుగులో స్టార్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రియా ప్రకాశ్ సినిమాకు రెమ్యునరేషన్ గా కోటి ఇస్తేనే చేస్తా అంటుందట. అంత ఇచ్చి అమెకు అవకాశం ఇవ్వడం జరుగుతుందా అన్నది ఆలోచిస్తున్నారు సిని జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news