Gossipsగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో బిగ్ బాస్ హీరో...

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో బిగ్ బాస్ హీరో కౌశల్..!

ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఒక బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారా సంపాదించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కౌశల్ ఇప్పడు మరో రికార్డ్ దిశగా దూసుకుపోతున్నాడు. అంతే కాదు ఏకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ఒక అభిమాన సంగమ కూడా ఆయనకు ఏర్పడడమే కాకుండా ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికీ రానన్ని ఓట్లు ప్రతి రోజు రావడం కేవలం కౌశల్ కి మాత్రమే సాధ్యం అయ్యింది.

అదే సమయంలో ఆయనకు వచ్చిన భారీ ఓట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కబోతోంది. కౌశల్ విన్ అవ్వడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అభినందించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక సింగిల్ కంటెస్టెంటుకు ఇన్ని ఓట్లు రావడం అనేది టీవీ హిస్టరీలోనే లేదంట. నాకు నిన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుంచి కాల్ వచ్చింది. వారు కొంత సమయం అడిగారు. త్వరలోనే అనౌన్స్ చేస్తానని కౌశల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ బిగ్ బాస్ హీరోకి సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసాడు కౌశల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news