Gossipsకౌశల్ ఆర్మీకి భయపడుతున్న నాని..!

కౌశల్ ఆర్మీకి భయపడుతున్న నాని..!

బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఈమధ్య మంచి రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. హోస్ట్ గా నాని షోలోని మజా ఎంజాయ్ చేస్తుండగా కంటెస్టంట్స్ అందరితో చలాకీగా మాట్లాడుతూ షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఇక హౌజ్ మెట్స్ విషయానికొస్తే బిగ్ బాస్ వల్ల కౌశల్ కు బయట బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. అతని ఫ్యాన్స్ అంతా కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు అదే కౌశల్ ఆర్మీ.

ఈ కౌశల్ ఆర్మీ టార్గెట్ చేస్తే ఎవరైనా సరే ఎలిమినేట్ కావాల్సిందే. కౌశల్ ను ఎవరు తక్కువ చేసి చూపినా సరే వారిని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నానికి కౌశల్ ఆర్మీ తాకిడి తగిలిందని టాక్. నాని కూడా కౌశల్ ఆర్మీకి భయపడేలా పరిస్థితులు తయారయ్యాయి.

షోలో క్రేజీ కంటెస్టంట్ గా మారిన కౌశల్ పట్ల బాబు నామినేషన్ టైం లో నాని ప్రవర్తన నచ్చని కౌశల్ ఆర్మీ నానిని ఆడేసుకున్నారు. అందుకే గడిచిన శని ఆదివారాల ఎపిసోడ్స్ లో కౌశల్ తో నాని కాస్త కూల్ గా మాట్లాడాడు. అంతేకాదు ఈసారి సేఫ్ జోన్ లో ముందు కౌశల్ పేరే చెప్పాలని నిర్ణయించుకున్నడని తెలుస్తుంది. ఇలా చూస్తే కౌశల్ క్రేజ్ నానిని కూడా మించేలా కనబడుతుంది. ఏ ముహుర్తాన కౌశల్ బిగ్ బాస్ కు వచ్చాడో కాని అతనికి ఓ క్రేజీ హీరో ఇమేజ్ మాత్రం ఏర్పడ్డదని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news