Gossipsకియరా లిప్ లాక్ సీన్స్ లీక్..బాలీవుడ్ లో హాల్ చల్..?

కియరా లిప్ లాక్ సీన్స్ లీక్..బాలీవుడ్ లో హాల్ చల్..?

బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాని తెలుగులో మహేష్ సరసబ భరత్ అనే నేను సినిమా చేసింది. ఆ సినిమా సక్సెస్ తో రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మడు. అయితే వివి ఆర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక కియరా అద్వాని బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తుంది. సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లలో కూడా అదరగొడుతుంది. ఇక ప్రస్తుతం అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ లో నటిస్తుంది కియరా అద్వాని. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మాత్రుక దర్శకుడు సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండకు స్టార్ డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి సినిమా హిందిలో కబీర్ సింగ్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే సినిమాకు సంబందించి హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్ లీక్ అయ్యింది. షూటింగ్ జరుగుతున్న టైంలో ఎవరో బయట వ్యక్తి ఈ లిప్ లాక్ సీన్ వీడియో తీసి లీక్ చేశారు. కియరా అద్వాని క్రేజీ ఫ్యాన్స్ సౌత్ లో కూడా ఉన్నారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా నుండి కొన్ని పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

సందీప్ వంగ తెలుగులో తీసినట్టుగానే బాలీవుడ్ కల్చర్ కు అనుగుణంగా కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్నాడట. షాహిద్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా తప్పకుండా తెలుగు అర్జున్ రెడ్డిలానే పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడట.

View this post on Instagram

Kirorimal college #kabir singh

A post shared by Happy_Club_KMC😎 (@happy_club_kmc) on

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news