Gossips' ఎవ‌రు వ‌ర్సెస్ ర‌ణ‌రంగం ' ... ఏది హిట్.. ఏది...

‘ ఎవ‌రు వ‌ర్సెస్ ర‌ణ‌రంగం ‘ … ఏది హిట్.. ఏది ప్లాప్..

టాలీవుడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా టాలీవుడ్‌లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇద్ద‌రు టైర్ 2 టాప్ హీరోలు న‌టించిన సినిమాలు కావ‌డంతో ఈ సినిమాల‌పై మంచి అంచ‌నాలే ఉండాలి. కాని ఒక సినిమా ప్ర‌మోష‌న్ల‌తో పాటు ప్రి బుకింగ్‌ల‌లో దూసుకుపోతే… మ‌రో సినిమా మాత్రం ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేకుండా రిలీజ్‌కు ముందే చతికిల‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’తో పాటు శర్వానంద్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన రణరంగం సినిమాలు రిలీజ్ అయ్యాయి.

గ‌త వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో ఈ రెండు సినిమాల‌కు మంచి టైం దొరికింది. జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటే ఆగ‌స్టు 15 సెల‌వు కావ‌డంతో మంచి ఓపెనింగ్స్ కూడా ఉండేవి. ఈ రెండు సినిమాల విష‌యంలో ఎవ‌రు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. అడ‌వి శేష్ త‌న సినిమా ప్ర‌మోష‌న్ల విష‌యంలో చాలా అడ్వాన్స్‌గా ఉన్నాడు.

ఇక ఒక రోజు ముందుగానే ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌కు, మీడియా వాళ్ల‌కు ప్రీమియ‌ర్ షో వేయ‌డం సినిమాకు యునాన‌మ‌స్‌గా హిట్ టాక్ రావ‌డంతో ఎవ‌రుకు బాగా క‌లిసొచ్చింది. దీంతో గురువారం ఉద‌య‌మే సినిమా బాగుంద‌న్న టాక్ బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఇలా ఈ సినిమాపై అంచ‌నాలు పెంచ‌డంలో అడ‌వి శేష్ బాగా స‌క్సెస్ అయ్యాడు. ఇక ర‌ణ‌రంగం ప‌రిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.

అటు ప్ర‌మోష‌న్ల‌లోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించి హ‌డావిడి లేక‌పోవ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రీ బుకింగ్‌లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. వాస్తవంగా చూస్తే శేష్‌తో పోలిస్తే శ‌ర్వాది పెద్ద మార్కెట్. అయినా శేష్ సినిమా దూసుకుపోతుంటే శ‌ర్వా ర‌ణ‌రంగం ఇలా డీలాప‌డ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ప్ర‌మోష‌న్ల విష‌యంలో శ‌ర్వా కాస్త దూకుడుగా ఉండి ఉంటే ర‌ణ‌రంగం ప‌రిస్థితి వేరుగా ఉండేద‌న్న టాక్ వ‌స్తోంది. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news