Gossipsఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు..!

ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అరవింద సమేత. దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైన ఈ సినిమా వసూళ్ల పరంగా ఎన్.టి.ఆర్ సత్తా ఏంటో మరోసారి చూపించింది. సినిమాలో ఎన్.టి.ఆర్ నటన, త్రివిక్రం టేకింగ్ ఊహించిన దాని కన్నా అద్భుతాలు చేసింది అరవింద సమేత.

రిలీజైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ పై పంజా విసిరిన యంగ్ టైగర్ 19 రోజుల్లో 165 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 5 లో నిలిచింది. అంతేకాదు ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎన్.టి.ఆర్ కెరియర్ లో కూడా హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా ఇది ప్రూవ్ అయ్యింది. టెంపర్ నుండి ఎన్.టి.ఆర్ ప్రతి సినిమాకు రికార్డ్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు.

అరవింద సమేత తన 28 సినిమాల రికార్డులన్నిటిని బద్ధలు కొడుతూ కెరియర్ లో నంబర్ 1 సినిమాగా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్.టి.ఆర్ ఆ సినిమాలో రాం చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news