Gossipsఎన్టీఆర్ కోసం బాలీవుడ్ సందడి.. పెరుగుతున్న అంచనాలు..!

ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ సందడి.. పెరుగుతున్న అంచనాలు..!

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ జాయిన్ అయ్యింది. ఎన్.టి.ఆర్ తో చాలా సినిమాలు చేసిన కృష్ణ కుమారి పాత్రలో కనిపించనుంది మాళవిక నాయర్. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఈ బయోపిక్ లో నటిస్తుండగా లేటెస్ట్ గా కృష్ణ కుమారి పాత్రలో మాళవిక నాయర్ సెలెక్ట్ అయ్యిందట.

ఇంత ప్రెస్టిజియస్ మూవీలో నటిస్తున్నందుకు మాళవిక నాయర్ తన ఆనందాన్ని వ్యక్తపరచింది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా వస్తుంది. మొదటి పార్ట్ కథానాయకుడిగా ఎన్.టి.ఆర్ సాగించిన అద్భుతమైన సినిమా ప్రస్థానం చూపిస్తారట. ఇక సెకండ్ పార్ట్ లో మొత్తం సినిమా రాజకీయాలకు సంబందించి ఉంటుందని తెలుస్తుంది.

ఇప్పటికే బాలకృష్ణ కాకుండానే కళ్యాన్ రాం, రానా, సుమంత్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ రకుల్, మాళవిక, విద్యా బాలన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news