Gossipsఆ విషయంలో శ్రీదేవిని మించిన జాన్వి..!

ఆ విషయంలో శ్రీదేవిని మించిన జాన్వి..!

అలాంటి అందాల తార శ్రీదేవి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఆమె బ్రతికి ఉండగానే కూతురిని హీరోయిన్ గా చూడాలని అనుకున్నారు కాని అది జర్గలేదు. శ్రీదేవి వారసత్వాన్ని అందుకుని జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దడక్ సినిమాతో జాన్వి మెప్పించిందనే చెప్పాలి. ఇక ఒక సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న జాన్వి గ్లామర్ షోలో తల్లిని మించేలా కనిపిస్తుంది. నెలకో ఫోటో షూట్ తో జాన్వి అదరగొడుతుంది.

ఈమధ్య జాన్వి మరింత రెచ్చిపోతుందని చెప్పొచ్చు. ఇటీవల వచ్చిన వోగ్ మెగజైన్ ఫోటో షూట్ లో జాన్వి ఇంకాస్త హంగమా చేస్తుంది. సినిమాలో కన్నా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది జాన్వి. ప్రస్తుతం అమ్మడు సౌత్ సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చూస్తుంటే తల్లిని మించిన అందగత్తెగా ప్రేక్షకుల ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది జాన్వి కపూర్.

దడక్ సినిమాలోనే లిప్ లాక్స్ తో రచ్చ చేసిన జాన్వి ఇక రానున్న సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపిస్తుందని ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి తర్వాత ఆమె ఫాలోయింగ్ ను తనకు ఏర్పరచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది జాన్వి. అందులో భాగంగానే ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను పిచ్చివాళ్లను చేస్తుంది. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా శ్రీదేవి చాలా సినిమాల్లో చేశారు. ఈ లెక్కన జాన్వి కూడా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. మరి జాన్వి చేసే మొదటి సినిమా ఏదవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news