Gossipsఆలీ పవన్ ల మధ్య రేగుతున్న చిచ్చు.. ఆలీ కి చుక్కలు...

ఆలీ పవన్ ల మధ్య రేగుతున్న చిచ్చు.. ఆలీ కి చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలిల మధ్య ఎలాంటి స్నేహబంధం ఉంటుందో తెలిసిందే. పవన్ తన ప్రతి సినిమాలో ఆలిని తీసుకుంటాడు. అలి లేని తనకు సినిమా చేయాలని ఉండదని.. తన సినిమాలో అలి కచ్చితంగా ఉంటాడని అన్నాడు పవన్ కళ్యాణ్. అయితే సమీకరణాలు మారడంతో పవన్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. అలితో రిలేషన్ ఇప్పటికి అలానే ఉందో లేదో తెలియదు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహపడుతున్న అలి లాస్ట్ ఎలక్షన్స్ టైం లోనే ఎక్కడో ఓ చోట నుండి పోటీ చేయాలని చూశాడు కాని కుదరలేదు.

ఈసారి మాత్రం కచ్చితంగా అలి పొలిటికల్ ఎంట్రీ షురూ చేసేలా ఉన్నాడు. పవన్ ఎలాగు పార్టీ పెట్టాడు కాబట్టి అలి పవన్ పార్టీలోనే చేరుతాడు అనుకున్నారు. కాని ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్.. ఈమధ్య అలి తరచు వైస్పి అధినేత వై.ఎస్ జగన్ ను కలుస్తున్నాడట. ఈమధ్య జగన్ ను కలిసి దిగిన అలి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలి, జగన్ మీటింగ్ సారాంశం వైసిపి నుండి అలి ఈసారి పోటీ చేస్తాడని టాక్. వైసిపిలో అలి చేరుతాడని అంటున్నారు. అయితే ఈ కామెంట్స్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ అలి మీద విరుచుకు పడుతున్నారు.

సినిమా రిలేషన్ ఉంది కదా అని పవన్ జనసేనలో అలి చేరాల్సిన అవసరం లేదు. మరి జగన్ ఏం చెప్పి అలిని ఒప్పించాడో కాని జగన్, అలిల మీటింగ్ తెలుగు సిని పరిశ్రమలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఏపి ఎలక్షన్స్ కచ్చితంగా సిని పరిశ్రమలో వర్గాలను ఏర్పరుస్తుందని అంటున్నారు. మరి అదెలా జరుగబోతుంది.. ఎవరెవరు ఏయే పార్టీకి సపోర్ట్ చేస్తారు అన్నది తెలుసుకోవాలంటే మరో 3 నెలలు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news