Gossipsఅలాంటి మొగుడే కావాలి.. కీర్తి సురేష్ లో కొత్త యాంగిల్..!

అలాంటి మొగుడే కావాలి.. కీర్తి సురేష్ లో కొత్త యాంగిల్..!

మళయాల పరిశ్రమ నుండి వచ్చిన కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమైన అమ్మడు ఆ తర్వాత నాని నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. మహానటితో పాటుగా అజ్ఞాతవాసి సినిమా కూడా చేసింది కీర్తి సురేష్. తెలుగుతో పాటుగా తమిళంలో కీర్తి హవా కొనసాగిస్తుంది. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటున్న కీర్తి సురేష్ మురుగదాస్ డైరక్షన్ లో రజినికాంత్ హీరోగా వస్తున్న సినిమాలో ఛాన్స్ పట్టేసింది.

ఇక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని.. అయినా ఇంకా ఆ వయసు తనకు రాలేదని అన్నది కీర్తి. ఒకవేళ ప్రేమించాలి అనుకుంటే తమిళ హీరోలు విజయ్, విక్రం లాంటి వారిని కావాలనుకుంటా అంటుంది. అలాంటి భర్త దొరికితే చాలని అంటుంది. విజయ్, విక్రం ల స్టైల్, స్మైల్ బాగుంటుందని అంటుంది కీర్తి సురేష్. మరి తెలుగులో ఎవరు నచ్చలేదు కాబోలు అమ్మడికి కోలీవుడ్ స్టార్స్ మీద మనసు మళ్లిందని అంటున్నారు.

మాహనటి తర్వాత తెలుగులో కీర్తి సురేష్ కు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ లో కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. మరి ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. తన సహజ నటనతో ఆకట్టుకుంటూ సినిమా సినిమాకు సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్న కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలు మాత్రం తన వల్ల కాదని అంటుంది. మరి రానున్న రోజుల్లో కీర్తి సురేష్ తనలోని ఆ యాంగిల్ కూడా చూపిస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news