Gossipsఅడ్డంగా మీడియాకి దొరికిన టాక్సీవాలా హీరోయిన్..!

అడ్డంగా మీడియాకి దొరికిన టాక్సీవాలా హీరోయిన్..!

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా టాక్సీవాలా. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రియాంకా జవల్కర్. సినిమాలో గ్లమరస్ గా కనిపించడమే కాదు సినిమా రిలీజ్ తర్వాత అమ్మడు హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాతో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకునేలా ప్రియాంకా పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉంది. అంతేకాదు రవితేజ, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ప్రియాంకా సెలెక్ట్ అయ్యింది. ఇదిలాఉంటే అమ్మడు ఓ ఫోటో వల్ల నవ్వులపాలయ్యింది.
2
సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ నెస్ చూసి ఆమె చిన్నప్పటి ఫోటో ఎలా కనిపెట్టాడో ఏమో కాని అది ట్వీట్ చేసి ఓ నెటిజెన్ ఆమెను ఓ ఆటాడుకున్నాడు. తన ఫ్యాన్ అని చెబుతూనే తనపై ఆ అభిమాని చేసిన ఈ పనికి ప్రియాంకా షాక్ అయ్యింది. ఫోటోలో ఉన్నది తనే అని.. అది చిన్నప్పటి ఫోటో అని.. ఒప్పేసుకుంది అమ్మడు. అయితే పరిస్థితులను బట్టి మనుషులు మారుతారని.. విజయ్ కూడా మారుతాడని. అలానే తాను ఇలా మారానని చెప్పుకొచ్చింది ప్రియాంకా. ఆ ఫోటోలోని వ్యక్తి తానే అని చెప్పి నిజాన్ని ఒప్పుకున్నా ఈ వీకెండ్ మీ సంతోషాన్ని నేను దొరికానా అంటూ తనపై తానే సెటైర్ వేసుకుంది ప్రియాంకా.
1
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కు అంత ప్రోత్సాహం ఉండదు అన్న కామెంట్స్ ను అసలేమాత్రం పట్టించుకోని ఈ హీరోయిన్ మెరుపులు చూస్తుంటే కొంతకాలం కెరియర్ కొనసాగించేలానే ఉంది. టాక్సీవాలాలో అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాకున్నా సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక రానున్న సినిమాలో ఆమె ఎలా కనిపించబోతుందో చూడాలి. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ప్రియాంకా చిన్నప్పటి ఫోటో మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news