షాకింగ్ : బిగ్ బాస్ 3 హోస్ట్ ఎన్.టి.ఆర్..?

77

స్టార్ మా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోని తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తూ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను హోస్ట్ గా తీసుకున్నారు. తారక్ తన ఎనర్జిటిక్ హోస్టింగ్ టాలెంట్ తో బుల్లితెర మీద చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ జనాల్లోకి అంత బాగా వెళ్లింది అంటే అది తారక్ వ్యాఖ్యానం వల్లే అని చెప్పొచ్చు. మొదటి సీజన్ ఎలా గోలా హిట్ కొట్టగా బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. తారక్ రేంజ్ కాకున్నా నాని కూడా పర్వాలేదు అనిపించాడు.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా ఎవరు చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలైతే సీజన్ 3కి మళ్లీ ఎన్.టి.ఆర్ ను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ముందు ఎన్.టి.ఆర్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది కాని ఇప్పుడు సారీ అనేస్తున్నాడట. అలా ఎందుకు అంటే ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రాజమౌళి డైరక్షన్ లో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

దీనికోసం ఎన్.టి.ఆర్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడు. అందుకే ఈమధ్య గడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తే ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుంది. సీక్రెట్ గా ఉంచుదామనుకున్న ఎన్.టి.ఆర్ లుక్ లీక్ అవడం ఇష్టం లేకనే రాజమౌళి ఎన్.టి.ఆర్ తో బిగ్ బాస్ చేయొద్దని చెప్పాడట. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి అయ్యాకనే బిగ్ బాస్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ మాత్రం వెంకటేష్, నాగార్జున, రానా వంటి వారు హోస్ట్ గా చేస్తారని అంటున్నారు.

Leave a comment