శ్రీనివాస్ రెడ్డి జంబలకిడి పంబ రివ్యూ & రేటింగ్

jambalakidipamba-movie-revi

కమెడియన్ గా ఉంటూనే హీరోలుగా మారిన వారు చాలామందే ఉన్నారు. సునీల్ నుండి షకలక శంకర్ వరకు తమకు వచ్చిన క్రేజ్ ను వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నాళ్ల నుండో కమెడియన్ గా చేస్తూ వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కూడా హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. గీతాంజలితో మొదటి ప్రయత్నం సక్సెస్ అవగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమా నిరాశపరచింది. ఇక ముచ్చటగా మూడోసారి ఓ సూపర్ హిట్ సినిమా టైటిల్ తో జంబ లకిడి పంబ అంటూ వస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. జె.బి మురళి కృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఎనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

భార్య భర్తలైన హీరో హీరోయిన్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో లాయర్ పోసాని కృష్ణ మురళి దగ్గరకు వస్తారు. ఆయన వీరి విడాకుల కేసు టేకప్ చేయగానే చనిపోతాడు. అయినా సరే వీరిద్దరిని కలపాలని ఆత్మ రూపంలో వస్తాడు. ఇక వారి ప్రవర్తనను మార్చేసి ఒకరి గురించి మరొకరు తెలుసుకునేలా చేస్తాడు. ఇంతకీ హీరో హీరోయిన్ వారి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టారా..? ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్న కారణలేంటి..? వారి కథ ఎలా ముగిసింది అన్నది సినిమా.

నటీనటుల ప్రతిభ :

శ్రీనివాస్ రెడ్డి చాలా బాగా చేశాడు. లేడీ అభినయం తో తన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక హీరోయిన్ సిద్ధి ఇద్నాని పాత్ర కూడా బాగుంది. హీరోతో సమానంగా ఆమె నటన కనబరచింది. వెన్నెల కిశోర్ ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పోసాని పాత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ ఆయన మార్క్ కనిపించలేదని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కథ, కథనాలు దర్శకుడి ప్రతిభ కనిపించేలా చేస్తున్నా ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. మొదటి భాగం విసుగు తెప్పిస్తుంది. ఎడిటింగ్ ఇంకా జాగ్రత్త పడాల్సింది. జో జో జోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

జంబలకిడి పంబ అనగానే ఈవివి తీసిన సూపర్ హిట్ సినిమా గుర్తుకొస్తుంది. ఆ టైటిల్ తో శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రయత్నమే ఈ జంబ లకిడి పంబ. సినిమా కథ కొత్తగా అనిపించినా కథనంలో దమ్ము చూపలేదు. దర్శకుడు మురళికృష్ణ ఏమాత్రం ఆకట్టుకునే కథనం రాసుకోలేదు.

మొదటి భాగమే బోర్ కొట్టించేస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అనిపించినా మొదటి భాగం ఎఫెక్ట్ పడక తప్పలేదు. శ్రీనివాస్ రెడ్డి స్టైల్ లో కామెడీ పండించినా అది వర్క్ అవుట్ కాలేదు. వెన్నెల కిశోర్ పాత్ర అటు ఇటుగానే అనిపిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ అవుతుందని ఆశించిన జంబ లకిడి పంబ ఆడియెన్స్ కు నిరాశపరుస్తుంది.

హీరో, హీరోయిన్ అబ్బాయి అమ్మాయిలా.. అమ్మాయి అబ్బాయిలా ప్రవర్తించడం కొంతమేర ఆసక్తి రేపుతుంది. అయినా అది సినిమాను కాపాడలేదు. ప్రయోగం అనుకుని ఈ సినిమా తీసిన శ్రీనివాస్ రెడ్డి సినిమా ఎంటర్టైనింగ్ కు కావాల్సిన స్టఫ్ లేదని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ కాస్టింగ్

సినిమాటోగ్రఫీ

కామెడీ

మైనస్ పాయింట్స్ :

కథనం

ఎడిటింగ్

బాటం లైన్ :

జంబ లకిడి పంబ.. ఆకట్టుకోని శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం..!

రేటింగ్ : 2/5

Leave a comment