మహేష్ డైరెక్టర్ ని ఆదుకుంటున్న బన్నీ..

16

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఈ సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా భాగస్వామ్యం అవుతున్నాడు. ఫిబ్రవరి 14న సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరాకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్ని కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ తో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.

కొన్నాళ్లుగా అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలైతే లింగుసామి డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో బన్ని సినిమా అని రెండు మూడేళ్ల క్రితమే ఎనౌన్స్ చేశారు. కాని ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే ప్రస్తుతం లింగుస్వామి రేసులో వెనుకపడి ఉండటం వల్ల అల్లు అర్జున్ కన్ను మురుగదాస్ మీద పడ్డది. తమిళంలో స్టార్ డైరక్టర్ అయిన మురుగదాస్ తెలుగులో చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ సినిమాలను చేశాడు.

ఈ రెండు సినిమాల్లో స్టాలిన్ యావరేజ్ గా నిలవగా.. స్పైడర్ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సర్కార్ సినిమా తర్వాత రజినికాంత్ తో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు మురుగదాస్. ఈ ప్రాజెక్ట్ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో బన్ని సినిమా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment