బ్రహ్మీ, సునీల్ రికార్డు బ్రేక్ చేసిన బండ్ల గణేష్..!

బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ తర్వాత వెండి తెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. హీరోల పక్కన స్నేహితుడిగా నటిస్తూ..తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. కమెడియన్ గా సత్తా చాటుతున్న సమయంలోనే ఒక్కసారే నిర్మాతగా మారాడు. అంతేనా స్టార్ హీరోలతో సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో బండ్ల తీసిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు ముందు నుంచి పవన్ ని దేవుడిగా భావించే బండ్ల గణేష్ అప్పటి నుంచి పవన్ నామ స్మరణే చేస్తున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్న బండ్ల ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీవైపు వస్తున్నారు.

ప్రస్తుతం అనీల్ రావడిపూడి దర్శకత్వంలో వస్తున్నా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే దీనికి బ్రహ్మీ, సునీల్ రికార్డుకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా?..అవును ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఒక రోజుకి రూ. 5 లక్షలు తీసుకునే వారిలో బ్రహ్మ, సునీల్ మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ రికార్డు తిరగరాస్తున్నాడు బండ్ల గణేష్. ఇప్పటి వరకు వెయ్యి సినిమాలకు పైగా నటించిన బ్రహ్మానందానికి ఆ రేంజ్ ఉండటం సహజం..ఇక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన సునీల్ కి ఆ రేంజ్ ఉండటం సహజం..కానీ ఒకప్పుడు సామాన్య కమెడియన్ గా నటించి తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్లకు ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం నిజంగా రికార్డే అంటున్నారు టాలీవుడ్ వర్గం.

బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్న విషయం తెలుసుకుని దర్శకుడు మారుతీ లేటెస్ట్ గా తీస్తున్న ‘ప్రతిరోజు పండగే’ మూవీలో అడిగారట. కానీ బండ్ల మాత్రం తన రెమ్యూనరేషన్ చెప్పడంతో మారుతికి మైండ్ బ్లాయ్ అయి ఆయన స్థానంలో అజయ్ ని తీసుకున్నట్లు సమాచారం.

Leave a comment