బుల్లితెరలో కాదు వెండితెర మీద ఎన్టీఆర్ తో పోటీ పడుతున్న నాని..!

1

ఎన్టీఆర్ మొదలు పెట్టిన బిగ్ బాస్ ను ప్రస్తుతం సీజన్-2 లో నాని హోస్ట్ గా కొనసాగిస్తున్నాడు. స్మాల్ స్క్రీన్ పై ఎన్.టి.ఆర్ తో సమానంగా ఇమేజ్ ఉందని టాలెంట్ చూపిస్తున్న నాని సిల్వర్ స్క్రీన్ పై ఎన్.టి.ఆర్ తో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. నాగార్జున, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా దసరా బరిలో రిలీజ్ అవుతుందట.

ఆల్రెడీ దసరాకి రిలీజ్ ప్లాన్ చేసుకున్న అరవింద సమేత సినిమాతో దేవదాస్ పోటీపడుతుంది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీగా అరవింద సమేత మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు పోటీగా దేవదాస్ అంటే కాస్త కష్టమే. అయితే నాగ్, నానిల మల్టీస్టారర్ కాబట్టి దేవదాస్ మీద కూడా అంచనాలున్నాయి.

మరి ఈ పోటీలో పైచేయి ఎవరిదవుతుందో చూడాలి. ఇవే కాకుండా దసరాకి సామి-2, పందెం కోడి-2 లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీరందరిలో ఎవరు దసరా విన్నర్ గా నిలుస్తాడో చూడాలి.

Leave a comment