ప్రాబ్ల‌మ్స్‌లో నాని..

నేచుర‌ల్ స్టార్ నాని జెర్సీ సినిమా త‌ర్వాత రాబోతున్న సినిమా `గ్యాంగ్ లీడ‌ర్‌`. ఈ సినిమాకు విక్రం కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇందులో నాని, కార్తికేయ, ప్రియాంక అరుళ్, మేఘా ఆకాష్ నటించారు. ఈ సినిమా హర్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందించారు. మ‌రియు నిర్మాత‌లు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఒకే తేదీకి మూడు నాలుగు సినిమాలు రిలీజవుతుంటే నిర్మాతలకు రకరకాల టెన్షన్లు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ సోలో రిలీజ్‌ కోసం ఆరాటపడతారు.

అయితే తాజాగా గ్యాంగ్‌ లీడర్‌కి వేరొక సినిమా అడ్డు లేకుండా ఉండేలా ప్లాన్‌ చేశారు. ఆగస్టు 30వ తేదీని ముందే ప్రకటించేశారు. అలాగే ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న సాహోకు పోటీ లేక‌పోయినా.. గ్యాంగ్ లీడ‌ర్‌కు మాత్రం కొంద‌రు పోటీ ఉన్నార‌ట‌. కాబట్టి ఆ తేదీకి వేరే సినిమాలేవీ రాకుండా వీరు ముందుగానే జాగ్రత్త లు తీసుకున్నారట. కానీ సెట్స్‌లో నానీకి గాయం అవ్వడం, కొంత విరామం రావ‌డంతో అనుకున్న తేదీకే నాని సినిమా వ‌స్తుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌ అని భావిస్తున్నారు.

అలాగే కథలో అవసరం మేర మార్పుచేర్పులు యాడింగ్స్‌ చేయడం మరి కొంత షూట్‌ వాయిదాకి కారణమైందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే చెప్పిన తేదీకి గ్యాంగ్ లీడ‌ర్ రాక‌పోతే ఈ సినిమాకు పోటీ ప‌డిన వారంతా ఆగ‌స్టు 30 తమ సినిమాల్ని రిలీజ్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. కార‌ణం ఏదైనా ముందు చెప్పిన‌ తేదీకి గ్యాంగ్‌ లీడర్‌ రాకపోవచ్చని సెప్టెంబర్‌కి వాయిదా పడిందని మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. మ‌రి ఈ డైల‌మా నుంచి బ‌య‌ట‌ప‌డి అనుకున్న తేదీకి ఈ సినిమా రిలీజ్ అవుతోందో? లేదో? చూడాల్సి ఉంది.

Leave a comment