పూరి – ఛార్మీ గాసిప్‌పై రామ్ క్లారిటీ…

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు.. రూ. 25 కోట్ల షేర్ మార్క్‌ టచ్ చేసిన ఈ సినిమా సోమవారం నుంచి కూడా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా రోజుల తర్వాత రామ్ – పూరి ఇద్దరికి రావడంతో ఈ సినిమా యూనిట్ సంబ‌రాల్లో మునిగిపోయింది.

చివరకు గురువు రామ్‌గోపాల్‌వ‌ర్మ సైతం సంబరాల్లో రెచ్చిపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్న పూరి – ఛార్మీ మధ్య సమ్‌థింగ్‌… స‌మ్‌థింగ్ ఉంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్‌లకు తోడు ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ సమయంలో పూరి, ఛార్మీల మధ్య గొడవ జరిగింది. దాని భరించలేక హీరో రామ్ విదేశాలకి చెక్కేశాడ‌న్న ప్ర‌చారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అక్క‌డితో ఆగ‌కుండా హీరో రామ్ కి సగం పారితోషికం మాత్రమే ఇచ్చారు. సంగీత దర్శకుడు మణిశర్మకి ఇంకా పూర్తి పారితోషికం ముట్టలేదని ఓ మీడియా కథనం రాసింది. అందుకే రామ్ సినిమా రిలీజ్ అవుతుంటే అమెరికా వెళ్లిపోయాడ‌న్న గుస‌గుస‌లు కూడా వ‌చ్చాయి. దీనిపై రామ్ స్పందిస్తూ ఈ గాసిప్స్ చ‌దువుకుంటే త‌న‌కు న‌వ్వు ఆగ‌లేద‌ని… ఈ గాసిప్ సూప‌ర్ అని ’’ బంగారం అండీ వీళ్లు..’’ అంటూ పూరీ, ఛార్మిని ట్యాగ్‌ చేశారు.

ఇక చాలా రోజులుగా పూరి – ఛార్మీపై వ‌స్తోన్న వ‌దంతుల‌కు రామ్ క్లారిటీతో అయినా చెక్ ప‌డుతుందా ? లేదా మ‌ళ్లీ ఇవి కంటిన్యూ అవుతాయా ? అన్న‌ది చూడాలి.

Leave a comment