పంతం హిట్టా ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

999

గోపిచంద్ హీరోగా నూతన దర్శకుడు చక్రవర్తి డైరక్షన్ లో వచ్చిన సినిమా పంతం. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కే.కే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపిచంద్ కు ఈ టాక్ నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో గోపిచంద్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ అంత వర్క్ అవుట్ కాలేదు. ఇక ఈ సినిమాలో గోపిసుందర్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. కథ, కథనాలు ఎక్కడ బోర్ కొట్టించకున్నా రొటీన్ గా సాగాయన్న టాక్ వస్తుంది.

ఇక ప్లస్సుల విషయానికొస్తే.. గోపిచంద్ కోర్ట్ సీన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకుల మీద రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా అనిపించాయి. అయితే సినిమా టాక్ ను బట్టి చూస్తే రేపు రిలీజ్ అవుతున్న తేజ్ ఐలవ్యూ సినిమా మీద ఈ సినిమా విజయం ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

Leave a comment