నోటా కి ఎదురుదెబ్బ.. విడుదల ముందు రోజే కోర్టు మెట్లు ఎక్కినా నోటా..

97

విజయ్ దేవరకొండ హీరోగా ‘నోటా’ అనే టైటిల్ తో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై అంతే స్థాయిలో అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు ఇప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నోటా అనే పదాన్ని సినిమా టైటిల్‌గా వాడటాన్ని తప్పుపడుతూ ఓయూ జేఏసీ నేత కైలాస్‌ నేత ఈ బుధవారం హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

‘నోటా’ అన్నది భారత ఎన్నికల సంఘం పరిథిలో ఉండే అంశం అని. దీనిని వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలని.. భారత ఎన్నికల సంఘం నుంచి నోటా సినిమా యూనిట్ ఏమైనా అనుమతి తీసుకుందా లేదా.. అనే విషయంపై పిటిషన్ దాఖలు చేశారు.

నోటా సినిమా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యువతపై ప్రభావం చూపుతుందని అదీ కాకుండా ఈ సినిమా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా తీశారని ఇలా అనేక వివివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ నిర్మాణంలో దర్శకుడు ఆనంద్ శంకర్, విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకుండా ఇప్పడు కోర్టు పిటిషన్ వెయ్యడంతో ఏం జరుగుతుందో చూడాలి.

Leave a comment