నెక్ట్స్.. హైదరాబాద్ నగర బహిష్కరణ శ్రీరెడ్డి..?

87

రాముడిని దూషించడమే కాకుండా సీతమ్మ రాముడి దగ్గర కాకుండా రావణుడి దగ్గర ఉండటమే కరెక్ట్ అన్న మహేష్ కత్తికి తెలంగాణా డిజిపి మహేందర్ రెడ్డి నగర బహిష్కరణ వేటు వేశారు. 6 నెలల పాటు కత్తి మహేష్ నగరంలోకి రాడానికి అనుమతి ఇవ్వలేదు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ టార్గెట్ పెట్టుకుని వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ఏకంగా దేవుడిని దూషించడంతో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది.

ఇక పనిలో పనిగా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు.. అనవసర రాద్ధాంతం చేసే వారి మీద దృష్టి పెట్టారట. ఆ లిస్టులో మహేష్ కత్తి తర్వాత శ్రీ రెడ్డి ఉందని టాక్. కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించిన శ్రీరెడ్డి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన తల్లిని దూషించింది. మెగా ఫ్యాన్స్ తనని కెలుకుతున్నారంటూ.. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసి హంగామా చేస్తున్న శ్రీరెడ్డికి నగర బహిష్కరణ వేటు వేసే ఆలోచన చేస్తున్నారట.

ఇప్పటివరకు జరిగింది ఓకే ఇక మీదట శ్రీరెడ్డి ఏదైనా విషయం పట్ల అనవసర రాద్ధాంతం చేస్తే తప్పకుండా ఆమెకు కత్తి మహేష్ లానే నగర బహిష్కరణ తప్పదని అంటున్నారు. మరి శ్రీరెడ్డి ఇకనుండైనా జాగ్రత్త పడుతుందేమో చూడాలి.

Leave a comment