నాని గురించి మాధవిలత.. తెర మీదనే హీరో..!

Madhavi latha shocking comments on Nani

కాస్టింగ్ కౌచ్ లో భాగంగా శ్రీరెడ్డి నాచురల్ స్టార్ నాని మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో వార్త సంచలనంగా మారిన నాని శ్రీరెడ్డి ఇష్యూపై నానితో స్క్రీన్ షేర్ చేసుకున్న మాధవిలత స్పందించింది. నాని, మాధవిలత కలిసి స్నేహితుడా సినిమాలో నటించారు. ఆ టైంలో ఎవరి పనులు వారు చేసుకునే వాళ్లం అంతేకాదు ఇద్దరికి అది రెండో సినిమా కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగలేదని అన్నది మాధవిలత.

ఇప్పటికి ఎక్కడ కనిపించినా సరే హాయ్ అంటే హాయ్ అంతే తప్ప మిగతా విషయాలేవి మాట్లాడమని అన్నది మాధవిలత. కొత్తలో అందరికి ఓ భయం ఉంటుంది స్టార్ డం పెరిగినా కొద్ది ఏం చేసినా చెల్లిపోతుందని భావిస్తారని అందుకే ఇలా చేస్తున్నారని అన్నది మాధవిలత. ఇక నాని మీద వస్తున్న ఆరోపణలన్ని నిజమా కాదా అన్నది తనకు తెలియదని కాని అప్పట్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మీ హీరో ఇలాంటి వాడా అంటూ చెప్పారని.. అప్పుడు తాను వాళ్లకి క్లాస్ పీకినట్టు తెలిపింది మాధవిలత.

అంతేకాదు స్క్రీన్ మీద హీరోలుగా కనిపించే వారంతా రియల్ లైఫ్ లో హీరోలు కాలేరని.. కేవలం కొంతమంది మాత్రమే అలా ఉంటారని అన్నది. మాధవిలత ఇచ్చిన వివరణ నానికి మళ్లీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

Leave a comment