నాగ బాబు ఓవరాక్షన్ కి బాలయ్య రియాక్షన్..!

80

మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ గత రెండు రోజులుగా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అవేవో ఎవరో అన్న మాటలని పట్టుకుని బాలయ్యను టార్గెట్ చేయడం కాకుండా బాలకృష్ణ గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్, చిరంజీవిల మీద చేసిన వ్యాఖ్యలను మాట్లాడిన టివి ఛానెల్స్ లోగోలతో చూపించి ఒక్కొదాని గురించి అడుగుతున్నాడు నాగబాబు.

అయితే ఈ కామెంట్స్ బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్టు కథానాయకుడు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. నాగబాబు కామెంట్స్ గురించి తెలిసినా సరే టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుదామని అనుకుంటున్నాడట. ఇక రిలీజ్ కు ఒక్కరోజే ఉండటంతో ప్రస్తుతం తిరుపతిలో ప్రమోషన్స్ లో ఉన్న బాలకృష్ణను నాగబాబు కామెంట్స్ పై స్పందించాలని ఓ జర్నలిస్ట్ అడిగాడట. అయితే బాలకృష్ణ ఆ లెక్కలు ఇక్కడ ఎందుకు అంటూ చెప్పుకొచ్చాడట.

నాగబాబు కామెంట్స్ పై టిడిపి లీడర్స్ ఎవరు తిరిగి కామెంట్ చేయొద్దని కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారట. టిడిపి కార్యకర్తలు ఎవరు నాగబాబు కామెంట్స్ కు స్పందించవద్దని.. బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలను నాగబాబు ప్రస్థావిస్తున్నాడు తప్ప జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పాడట. మొత్తానికి నాగబాబు కామెంట్స్ పై రెస్పాండ్ అయితే రావడం లేదు కాని అతను చేయాలనుకున్న టార్గెట్ మాత్రం రీచ్ అయిందని చెప్పొచ్చు.

Leave a comment