తెలుగురాష్ట్రాలలో 2.0 కి ఎదురుదెబ్బ.. తెలుగోళ్లు అంటే రజినీకి ఎందుకంత చులకన..

11

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ 2.ఓ. బోరోబ్ సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతుంది. అయితే రిలీజ్ టైం దగ్గర పడుతున్నా తెలుగులో సినిమా ప్రమోషన్స్ ఏమి చేయలేదు. సోమవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగినా అది కూడా మొక్కుబడిగానే జరిగింది.
2
ఫ్లోలో రజిని కూడా అసలు ఈ సినిమాకు ప్రమోషన్స్ అవసరం లేదు ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఎన్వి ప్రసాద్ డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెడుతున్నారని అన్నారు. తమిళంలో బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్న రజిని, శంకర్ లు తెలుగులో అసలు ప్రమోషన్ అవసరం లేదని చెప్పడం రజిని మాటల్లోని అర్ధమేంటో తెలియాల్సి ఉంది. తెలుగు ప్రేక్షకులు తమ సినిమా తప్పకుండా చూస్తారన్న ధైర్యమా లేక ఎలాగు సినిమాకు ఓ పాజిటివ్ బజ్ వచ్చింది కాబట్టి ప్రమోషన్స్ ఎందుకనా అన్నది అర్ధం కావట్లేదు.
1
ఏది ఎలా ఉన్నా తెలుగు ప్రమోషన్స్ లో మాత్రం రజిని తెలుగు వాళ్లు గొప్పోళ్లు.. తెలుగు వంటకం రుచి గొప్పది.. తెలుగు అమ్మాయిలు అంటూ ఇక్కడ ఆడియెన్స్ కు సోప్ వేసే కార్యక్రమం చేపట్టారు. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా మాట్లాడుతున్నారని ప్రేక్షకులు కూడా గుర్తించేలా రజిని మాటలు ఉండటం విశేషం. మరి అసలు ప్రమోషన్ అవ్సరం లేదని అనుకునే చివరి నిమిషంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారట. అది కూడా తెలుగు రిలీజ్ చేస్తున్న నిర్మాతల ఒత్తిడి వల్లే అని తెలుస్తుంది.

Leave a comment