తారక్ నెంబర్ వన్ .. నెంబర్ టూ..? తేల్చేసిన ప్రభాస్..

14

టాలీవుడ్ నంబర్ 1 హీరో ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. అయితే ఇదే ప్రశ్న ప్రభాస్ ను అడిగితే మాత్రం అందులో డౌట్ ఎందుకు యంగ్ టైగర్ ఎన్.టి.ఆరే అనేస్తున్నాడు. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లిన ప్రభాస్ ముందు 1,2,3,4 కేటగిరిలు ఉంచాడు. మహేష్, ఎన్.టి,ఆర్, రాం చరణ్, బన్ని ల పేర్లు చెప్పాడు. వీరిలో నువ్వు ఎవరికి ఎలా రేటింగ్ ఇస్తావు వారి స్క్రీన్ ప్రెజెన్స్ ను బట్టి అని అడుగగా.. క్షణం తడుముకోకుండా ఎన్.టి.ఆర్ నంబర్ 1 అనేశాడు ప్రభాస్. ఇక 2,3,4 లకు ఒక్క సెకన్ ఆలోచించి సెకండ్ మహేష్ 3 బన్ని, 4 రాం చరణ్ అనేశాడు.

ఎన్.టి.ఆర్ మీద ప్రభాస్ కు ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. టాలీవుడ్ నంబర్ రేసు ఇప్పుడు లేదని అంటున్నా ఎవరికి వారు తమ హీరో నంబర్ 1 అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే స్టార్స్ మనసులో ఈ వర్షన్ ఎలా ఉందో ప్రభాస్ మాటలని బట్టి అర్ధమవుతుంది. ఎన్.టి.ఆర్ నటన విశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్ర అయినా తారక్ చేశాడంటే దుమ్ముదులిపేస్తాడు. ఈ యంగ్ జెనరేషన్ లో ఆయనలా నటించే సత్తా ఉన్న నటుడు లేడని చెప్పాలి. అయితే స్టార్ అందరు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అభిమానులను అలరిస్తున్నారు అనుకోండి.

ప్రభాస్ ఇచ్చిన ఈ నంబర్ రేసింగ్ లో చరణ్ కన్నా ముందు బన్ని ఉండటం కాస్త మెగా ఫ్యాన్స్ కు నచ్చకపోవచ్చు. అయితే ఈ రేటింగ్ కేవలం ప్రభాస్ తన మనసులో అనుకునేది. ఇది నిర్ధారణ చేసుకుని నంబర్ రేటింగ్ ఇవ్వలేరు కదా. మొత్తానికి ప్రభాస్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి రాజమౌళి మల్టీస్టారర్ లో నటిస్తున్నారు.

Leave a comment