ఢీ 10కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్..! (వీడియో)

ntr-dhee-10

ఈటివి డ్యాన్స్ షో అంటే నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఏర్పడింది. 10 సీజన్లుగా నెంబర్ 1 డ్యాన్స్ షోగా క్రేజ్ తెచ్చుకున్న ఢీ ప్రోగ్రాం ప్రస్తుతం డీ10 గా దుమ్మురేపే కంటెస్టంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఫైనల్స్ కు దగ్గర పడిన ఈ షో ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. పొటాపోటీగా ఈ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కంటెస్టంట్స్.

ఇక ఈ ఫైనల్ షోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్స్ లో ఎన్.టి.ఆర్ ఒకరు. తన నటనతోనే కాదు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా అదరగొడతాడు తారక్. ఢీ10 కి స్పెషల్ గెస్ట్ గా తారక్ ప్రత్యేకంగా నిలవబోతున్నాడు. చూస్తుంటే ఈ సారి ఢీ 10 మరింత క్రేజ్ తెచ్చుకోనుంది.

Leave a comment