ఓవర్సీస్ లో ఎన్.టి.ఆర్ క్రేజ్.. వేలం పాటలో టికెట్ల బీభత్సం..!

47

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈ నెల 9న రిలీజ్ కానుంది. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్నారు. అయితే ఎన్.టి.ఆర్ సినిమాను ఓవర్సీస్ లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారట. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎన్.టి.ఆర్ గురించి తెలియని వారు ఉండరు. అలాంటి ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రగా వస్తున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎలా ఉందో ఓసారైనా చూడాలని అనుకుంటారు.

అయితే ఓవర్సీస్ లో మొదటి పార్టు కు సంబందించి నందమూరి ఫ్యాన్స్ భారీ హంగామా చేస్తున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలు అక్కడ మిలియన్ మార్క్ కూడా టచ్ చేయలేదు. అలాంటిది ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాను 3 మిలియన్ టార్గెట్ తో ప్రీమియర్స్ భారీ సంఖ్యలో ఎరేంజ్ చేస్తున్నారట. అంతేకాదు టికెట్లు కూడా భారీగా కొనేస్తున్నారట. కొన్ని ఏరియాలో టికెట్ల్స్ వేలం పాట వేస్తున్నారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు.

సినిమా మొత్తం మీద బాలకృష్ణ దాదాపు 60 గెటప్పులలో కనిపిస్తారట. బాహుబలి తరహాలో ఈ సినిమాను మొదటి పార్ట్ మధ్యలో ఆపేసి రెండో పార్ట్ కొనసాగిస్తారట. అయితే మహానాయకుడు మూవీని జనవరి 24న రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని ఆ సినిమా ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. మొత్తానికి ఎన్.టి.ఆర్ బయోపిక్ ఓవర్సీస్ హంగామా చూస్తుంటే రిలీజ్ ముందే సినిమా సూపర్ హిట్ అనేలా ఉంది. అయితే ఆడియో వేడుకలో ఈ సినిమా హిట్టు సూపర్ హిట్టు కాదు చరిత్ర సృష్టించాలని సృష్టిస్తుందని అన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

Leave a comment