ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ‘ కథానాయకుడు ‘

86

ఎప్పుడూ… తొడగొట్టడం… మీసం తిప్పడం… పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చెప్పడం ఇదే ఊహించుకుని బాలకృష్ణ సినిమాలకు వెళ్తుంటారు ప్రేక్షుకులు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారుస్తూ… సరికొత్త ట్రెండ్ సృష్టించాడు బాలయ్య. తాజాగా అయన నటించిన ఎన్టీఆర్ కధానాయకుడు సంక్రాంతి పండుగ ముందే పండుగ వాతావరణం తీసుకొచ్చింది .

ఈ సినిమా ఓవర్సీస్‌లో పాత రికార్డులు బద్దలు కొడుతోంది . వాస్తవంగా… బాలయ్య సినిమాకి ఓవర్సీస్‌లో అంతగా మార్కెట్‌ కానీ కథానాయకుడు మాత్రం ఆ రికార్డ్ బద్దలుకొట్టింది. అమెరికాలో మొత్తం 600 కు పైగా స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మూడున్నర కోట్ల రూపాయల వరకూ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది . ఈ మధ్య కాలంలో గీతగోవిందం సినిమా ఓవర్సీస్‌లో మొదటిరోజు 4,04,000 డాలర్లు వసూలుచేసి రికార్డు నెలకొల్పింది .ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది .

అదేవిధంగా చూసుకుంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ కథానాయకుడు వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది . ఈ సినిమా మొదటిరోజు 30 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు . అంతే కాకుండా… ఇప్పటి వరకూ విడుదలైన బాలయ్య సినిమాలన్నింటిలోనూ మొదటిరోజు టాప్ కలెక్షన్ లు వసూల్ చేసిన సినిమాగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది.

Leave a comment