ఎన్టీఆర్ – బాల‌య్య .. మ‌ళ్లీ పాత యుద్ధమేనా..?

2

నందమూరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య సంబంధం బలపడ్డదని నిన్నటిదాకా అనుకున్నారు. హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణ అన్న కుటుంబాన్ని చేరదీశాడు. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లతో పాటుగా ఆ కొద్దిరోజులు బాగా మాట్లాడినట్టు కనిపించారు. అరవింద సమేత ఈవెంట్ కు బాలయ్య వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఇదిలాఉంటే మళ్లీ బాబాయ్ అబ్బాయ్ ల మధ్య దూరం పెరిగిందని టాక్. అదెలా అంటే రీసెంట్ గా జరిగిన తెలంగాణా ఎలక్షన్స్ టైంలో ఎన్.టి.ఆర్ తన అక్క సుహాసిని కోసం ప్రచారం చేయకపోవడమే దానికి కారణాలు అంటున్నారు.

తండ్రి మరణించిన టైంలో అంతిమ సంస్కారాలన్ని తెలంగాణా ప్రభుత్వ చాలా గొప్పగా చేసింది. ఆ కృతజ్ఞతతో టి.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా ఎన్.టి.ఆర్ ప్రచారం చేయలేదు. అయితే అదే ఇప్పుడు బాలయ్యను అతనికి దూరం చేసిందట. ఎన్.టి.ఆర్ కు కొంతమంది సన్నిహితుల సలహా మేరకు మళ్లీ ఇప్పుడప్పుడే రాజకీయ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నాడట. అయితే అలాచూస్తే ఏపి ఎలక్షన్స్ లో కూడా ఎన్.టి.ఆర్ ప్రచారం కష్టమే అని అనుకోవచ్చు.

మరి వస్తున్న వార్తల్లో ఏమంత వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఎక్కడిదాకో ఎందుకు ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఆడియో ఇంకా ట్రైలర్ రిలీజ్ రేపు అనగా డిసెంబర్ 21న ఉంది. ఈ ఈవెంట్ లో నందమూరి ఫ్యామిలీ మొత్తానికి ఆహ్వానం పంపాడట బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ కూడా వస్తే ఇవన్ని రూమర్సే అని చెప్పొచ్చు. ఒకవేళ ఎన్.టి.ఆర్ ఈ ఈవెంట్ కు డుమ్మా కొట్టాడు అంటే మాత్రం మళ్లీ బాబాయ్, అమ్మాయిలు ఎప్పటిలానే దూరం దూరంగా ఉంటున్నారని అనుకోవచ్చు.

Leave a comment