ఎన్టీఆర్ బయోపిక్ పై జూ.ఎన్టీఆర్ స్పందన..?

87

నిన్న రిలీజైన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ప్రేక్షకుల మనసులు గెలిచింది. అక్కడక్కడ మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సినిమా ఓవరాల్ గా సూపర్ హిట్ అనేస్తున్నారు. మొదటి రోజు కలక్షన్స్ కూడా బాగానే వచ్చాయని అంటున్నారు. నందమూరి నట సింహం బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. సినిమాలో అందరు తమ తమ పాత్రలకు నిజ రూపం కల్పించారంటే నమ్మాలి. ఇక ఈ సినిమా చూసిన చాలామంది ఇండస్ట్రీ వారు మెచ్చుకున్నారు. దర్శకులు కూడా ఎన్.టి.ఆర్ కథానాయకుడి మీద తమ స్పందన తెలియచేశారు.

సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్.టి.ఆర్ గారికి బెస్ట్ ట్రిబ్యూట్ అంటూ బాలకృష్ణ నటనపై కూడా మహేష్ తన స్పందన తెలియచేశాడు. అయితే ఈ సినిమాపై ఎన్.టి.ఆర్ రెస్పాన్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నిన్న రిలీజైన ఈ సినిమాపై తారక్ ఎలాంటి కామెంట్ పెట్టలేదు. ముందు తన నుండి సినిమాపై స్పందన వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. మరి ఎన్.టి.ఆర్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు.. ఎన్.టి.ఆర్ సినిమా గురించి ఎలా మాట్లాడుతాడు అన్న విషయంపై ఎక్సైటింగ్ గా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. ఎన్.టి.ఆర్ ట్వీట్స్, కామెంట్స్ రూపంలో కాదు ఓ ప్రెస్ మీట్ పెట్టి బాబాయ్ బాలకృష్ణని పొగుడుతాడని అంటున్నారు.

Leave a comment