ఎన్టీఆర్ కోసం బాలయ్య వస్తున్నాడు.. కాని..?

27

ఎన్.టి.ఆర్, బాలకృష్ణల మధ్య కొన్నాళ్లుగా ఉన్న దూరం హరికృష్ణ మరణంతో దగ్గరైంది. తండ్రి మరణంతో ఎన్.టి,ఆర్. అన్న దూరమవడంతో మాటలు కుదిరాయి. అన్న కొడుకులిద్దరికి తాను అండగా ఉంటానని హామి ఇచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.

అక్టోబర్ లో రిలీజ్ కానున్న అరవింద సమేత సినిమా ఆడియో సెప్టెంబర్ 20న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా వస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ ఆడియో వేడుక కేవలం మీడియా సమక్షంలో ఓ ప్రెస్ మీట్ లా పెట్టి రిలీజ్ చేస్తారట. తండ్రి మరణించిన బాధలో ఉన్న ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఫ్యాన్స్ ను ఫేస్ చేయాలని అనుకోవడం లేదు.

అందుకే చాలా సింపుల్ గా అరవింద సమేత ఆడియో రిలీజ్ చేస్తున్నారట. బాలకృష్ణ ముఖ్య అతిధిగా వస్తున్నా కార్యక్రమం కొద్దిసేపట్లోనే ముగిస్తారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఒకే ఫ్రేమ్ లో బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ లు చూడాలని అనుకున్న నందమూరి ఫ్యాన్స్ వారిని డైరెక్ట్ గా చూసే అదృష్టాన్ని మాత్రం మిస్ అవుతున్నారని చెప్పాలి.

Leave a comment