ఎన్టీఆర్ కి వీరాభిమానిగా మారిన బాలీవుడ్ సూపర్ స్టార్..!

121

బాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు స్టార్ హీరో వరుణ్ ధావన్, చేసింది కొన్ని చిత్రాలే అయినా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యువ హీరో. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మేడమ్‌ టుస్సాడ్స్‌లాంటి అంతర్జాతీయ మ్యూజియంలో అతని మైనపు బొమ్మ ని ఎర్పాటు చేసారు. దీన్ని బట్టే అతని స్థాయి ఎంత వరకు పెరిగిందో చెప్పవచ్చు.

తాజాగా వరుణ్‌ ట్విటర్‌లో కాసేపు అభిమానులతో ముచ్చటించారు అందులో భాగంగా ఒక అభిమాని టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా దానికి వరుణ్ ధావన్ సమాధానమిస్తూ ” నేను ఎన్టీఆర్ కి వీరాభిమానినని” తెలిపారు…వరుణ్ ఇచ్చిన ఈ సమాధానం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరా పడిపోతున్నారు. వరుణ్ ధావన్ తాజా గా నటించిన చిత్రం ‘సూయీ ధాగా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అనుష్క శర్మ ఈ చిత్రం లో కథానాయిక గా నటించింది.

Leave a comment