ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కెరీర్ ఖ‌తం… దుకాణ బందే..

125

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులతో నెట్టుకొస్తోంది. గ‌త రెండేళ్ల‌లో ఆమెకు ఛాన్సులు రావ‌డ‌మే గ‌గ‌న‌మైంది. ఇటీవ‌లే ఆమె నటించిన ‘కవచం’ , ‘సీత’ సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. ఇక ఫైన‌ల్‌గా ఆమె ఆశ‌ల‌న్నీ శ‌ర్వానంద్ హీరోగా వ‌చ్చిన ర‌ణ‌రంగం సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో అయినా కాజ‌ల్ ద‌శ తిరుగుతుందేమో అని అంద‌రూ అనుకున్నారు.

గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చింది. శ‌ర్వానంద్‌కు, మ‌రో హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శినికి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నా కాజ‌ల్ గురించి మాట్లాడుకునే వారే లేకుండా పోయారు. ర‌ణ‌రంగం క్రెడిట్ లో కొంచెం కూడా కాజల్ అగర్వాల్ కి దక్కలేదు. సినిమా టాక్ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే అస‌లు ఈ సినిమా కాజ‌ల్ ఎందుకు ఒప్పుకుందా ? అన్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు.

కాజ‌ల్ అభిమానులు ఈ సినిమాలో ఆమె పాత్ర‌, లుక్ చూసి షాక్ అవుతున్నారు. సినిమాలో పెర్పామెన్స్‌కు స్కోప్ లేదు స‌రిక‌దా.. కనీసం ఆమె పాత్ర‌కు కూడా ఎలాంటి ప్ర‌యార్టీ లేకుండా పోయింది. చాలా చిన్న పాత్ర‌ను కాజ‌ల్ ఎందుకు ఒప్పుకుంది అని చాలా మంది డిజ‌ప్పాయింట్ అయ్యారు. ఏదేమైనా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఆమెతో న‌టించేందుకు సీనియ‌ర్ హీరోలు మిన‌హా మిగిలిన కుర్ర, మీడియం రేంజ్ హీరోలు అయితే సిద్ధంగా లేరు.

ఒక‌టి ఆరా ఛాన్సులు వ‌చ్చినా ఆమె రేటు విష‌యంలో కొండెక్కి కూర్చోవ‌డంతో ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి. ప్ర‌స్తుత‌ పరిస్థితులు చూస్తుంటే మాత్రం కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోతున్నట్టే అని కొందరు చెబుతున్నారు.

Leave a comment