ఆర్.ఆర్.ఆర్ మూవీ.. ఎన్.టి.ఆర్, చరణ్.. ఎవరెక్కువ.. ఎవరు తక్కువ..?

89

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తవగా ఈరోజు అనగా జనవరి 21 సోమవారం సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెట్ చేయడమే ఓ పెద్ద వండర్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఇద్దరిని ఒక వేదిక మీద చూడటమే అరుదు అనుకుంటున్న టైంలో ఇద్దరిని కలిపి మల్టీస్టారర్ ప్లాన్ చేయడం పెద్ద సాహసమే.

అయితే అది చేస్తుంది రాజమౌళి కాబట్టి ఫ్యాన్స్ కంగారు పడాల్సి అవసరం ఉండదు. అయితే కొందరు మాత్రం ఎన్.టి.ఆర్ కు ఎక్కువ రోల్ ఇచ్చి చరణ్ ను తక్కువగా చూపిస్తారని అంటుంటే.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఎన్.టి.ఆర్ ది తక్కువ పాత్ర చరణ్ కే ఎక్కువ ఇస్తున్నారని గుసగుసలాడుతున్నారు. సినిమాలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే డిస్కషన్ ఫ్యాన్స్ లో నడుస్తుంది. అయితే వారిద్దరు మంచి స్నేహితులు వారు హ్యాపీగా ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నారు.

వారికి లేని అనవసరమైన ఆలోచన ఫ్యాన్స్ కు ఎందుకు చెప్పండి. లీకవుతున్న విషయాలను బట్టి చూస్తే పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ముందు నెగటివ్ రోల్ గా కనిపిస్తాడట. అయితే పరిస్థితులు అతన్ని మార్చి మళ్లీ హీరోని చేస్తాయట. అయితే చరణ్ మాత్రం మొదటి నుండి ఒకే రకమైన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇద్దరు కనిపించే సీన్స్ అయితే సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి సినిమా వస్తేనే కాని అదెలా ఉంటుందో తెలుస్తుంది.

Leave a comment