అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

16

కాస్టింగ్ కౌచ్ మీద ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు.. వారిలో సంచలన నటి రాధికా ఆప్టే ఒకరు. తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ విషయాన్ని ఏమాత్రం భయం లేకుండా బయపెట్టే రాధికా ఓ నటుడు తనకి అర్ధరాత్రి మసాజ్ చేస్తా అని చెప్పిన విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఓ షూటింగ్ లో భాగంగా నడుము నొప్పి వచ్చిన రాధికా షూటింగ్ ముగించి వెళ్తుంటే అందులో నటించే నటుడు తనకు నడుం నొప్పి బాగా ఉంటే అర్ధరాత్రి వచ్చి తాను నొక్కుతా అన్నాడట.

ఆ మరునాడే షూటింగ్ లో యూనిట్ అందరికి ఆమె ఈ విషయాన్ని చెప్పగా ఆ తర్వాత నటుడు అది తప్పని గ్రహించి వచ్చి ఆమెకు సారీ చెప్పాడట. అయితే ఆ నటుడు మాత్రం ఆమెకు నిజంగానే హెల్ప్ చేసే ఉద్దేశంతోనే అలా అన్నాడని చెబుతుంది రాధికా ఆప్టే. లైంగిక వేధింపులకు సంబందించిన ఓ చర్చా వేదికలో పాల్గొన్న రాధికా ఆప్టే తనకు జరిగిన ఈ విషయాన్ని వెళ్లడించింది.

Leave a comment