” అరవింద సమేత ” ట్రైలర్ పై బాలయ్య స్పందన

110

నందమూరి కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడంలేదు. సీనియర్ ఎన్టీఆర్ మరణం తరువాత ఆ కుటుంబానికి హరికృష్ణ పెద్దగా ఉంటూ వచ్చాడు. ఇటీవల అయన కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇప్పడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు బాలకృష్ణ అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ – బాలయ్య మధ్య అప్పుడెప్పుడో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. కానీ హరికృష్ణ మరణాంతరం ఆ పరిస్థితులు చక్కబడ్డాయని అంతా భావించారు. అయితే ఆ మనస్పర్థలు ఇంకా చల్లారలేదని జూనియర్ ని ఇంకా బాలయ్య దూరం పెడుతున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే ఆ ఫంక్షన్ కి బాలయ్య వస్తాడని జూనియర్ లో జోష్ నింపుతాడని అంతా భావించారు. అయితే ఆ ఫంక్షన్ కి బాలయ్య రాకపోవడంతో తనను ఇంకా దూరం పెడుతున్నారని భావన జూనియర్ ఎన్టీఆర్ లో కనిపిస్తోంది. అదీ కాకుండా ఈ ఫంక్షన్ కి బాలయ్య ఎందుకు రాలేదు..? కారణం ఏంటిఅనే ప్రశ్నలతో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలయ్య ఈ ఫంక్షన్ కి ముందుగా వస్తానని చెప్పి మొఖం చాటెయ్యడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నట్టు అనేక అనుమానాలు బయలుదేరాయి. కానీ ఆ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ మాటలను బట్టి చూస్తే.. వారు తండ్రి మరణం వలన బాధతో పాటు కావాల్సినవారే తమను దూరం పెడుతున్నారనే బాధ కూడా వాళ్ళల్లో కనిపించింది. కాకపోతే ఆ బాధ బయటకి కనిపించకుండా వారు జాగ్రత్తపడ్డారు. కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటై కలిసి మెలసి ఉంటే నందమూరి అభిమానులకు పండగే కదా !

Leave a comment