అందరితోనూ తిట్టించుకుంటున్న మిల్క్ బ్యూటీ..

82

మిల్క్ బ్యూటీ తమన్నా… టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోల పక్కన నటించింది. టాప్ హీరోయిన్ గా తెలుగు ఇండ్రస్ట్రీలో ఆమె టాప్ రేంజ్ లో నిలుస్తూ వచ్చింది. అయితే కొద్ది కాలంగా ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించినా… మళ్ళీ ఆమె ఫామ్ లోకి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఆమె గురించిన ఆసక్తికర విషయాలను ఆమె స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆమె ఎప్పుడు ఏ సినిమాలో నటించినా… ఆ సినిమా యూనిట్ సభ్యులు ఆమెను తిడతారట! ఎందుకో తెలుసా? తమతో టైమ్ స్పెండ్ చేయడం లేదని! ‘ఎఫ్2’ ప్రెస్‌మీట్‌లో తమన్నా చెప్పుకొచ్చారు. షూటింగ్ చేసేటప్పుడు.. నా వర్క్ ఫినిష్ అయ్యాక నేను రూమ్‌కి వెళిపోతా. తన కో స్టార్స్ లేదా కొలీగ్స్‌తో నేను టైమ్ స్పెండ్ చేయను. చాలాసార్లు ఈ విషయమై సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ నన్ను తిడతారు. ‘సెట్‌కి వస్తావు కానీ.. మాతో మాట్లాడవు’ అని అంటుంటారు” అని తమన్నా అన్నారు. ‘ఎఫ్ 2’ సెట్‌లో మాత్రం అటువంటి తిట్లు ఏవీ లేవట.

ఎందుకు? అంటే… తన షూటింగ్, వర్క్ అయ్యాక మిగతా ఆర్టిస్టులతో మాట్లాడాలని తమన్నా సెట్‌లో వుండేవారట. ఎంతో సరదాగా సినిమా షూటింగ్ జరిగిందని ఆమె అన్నారు. ఈ సినిమాలో వెంకీగారు, వరుణ్, మెహ్రీన్ అందరితో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా టైమ్ స్పెండ్ చేశాను అంటూ ఆనందంతో చిరునవ్వులు చిందిస్తోంది ఈ మిల్క్ బ్యూటీ.

Leave a comment