Moviesటీజర్ తో సినిమాలో దమ్ము తెలిసేలా చేసిన నాగ చైతన్య..!

టీజర్ తో సినిమాలో దమ్ము తెలిసేలా చేసిన నాగ చైతన్య..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నూతన దర్శకుడు కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా యుద్ధం శరణం. వారాహి చాలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. దువ్వాడ జగన్నాధం లోని యుద్ధం శరణాం గచ్చామి అన్న డైలాగ్ తో టైటిల్ పెట్టారేమో అనుకున్నారు కాని సినిమా టీజర్ చూస్తే అబ్బో అదరగొట్టేశాడని చెప్పొచ్చు.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ తర్వాత అదే ఎనర్జీతో వస్తున్న సినిమా యుద్ధం శరణం. ఇక ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీకాంత్ విలన్ గా నటించడమే. సినిమా సత్తా చాటేలా టీజర్ అదరగొట్టేసింది. నాకు తెలిసిన ప్రపంచం ఇది కాదు అంటూ వచ్చే డైలాగ్.. టీజర్ లాస్ట్ లో శ్రీకాంత్ సీరియస్ నోట్ లో ఓ లుక్ అబ్బో టీజర్ లోనే ఇన్ని మెరుపులు ఉంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో అని అనుకుంటున్నారు.

ఈమధ్య కాలంలో టీజర్ తోనే సినిమా మీద ఓ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా చెప్పుకోదగ్గ టీజర్ లలో యుద్ధం శరణం కూడా ఒకటని చెప్పొచ్చు. లవణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

https://youtu.be/U0SrE_kMq2w

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news